“జైలర్ 2” రిలీజ్ డేట్ ఇదేనా?

“జైలర్ 2” రిలీజ్ డేట్ ఇదేనా?

Published on Dec 4, 2025 9:00 AM IST

జైలర్ 2

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “జైలర్ 2”. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా కూలీ లాంటి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది. ఇలా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీనికి గాను మేకర్స్ డేట్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా వచ్చే ఏడాది జూన్ 12 న పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో కూడా శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సన్ పిక్చర్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు