మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు. వైష్ణవ్ తేజ్ తో పాటు బుచ్చిబాబు సానా అనే సుకుమార్ అసిస్టెంట్ ను కూడా దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా తీసుకొస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా ఓటిటీలో రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. నాని ‘వి’తో మొదలైన డిజిటల్ విడుదల పరంపరలో మొత్తానికి ఉప్పెన కూడా చేరబోతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని.. ఈ సినిమాకి సదరు ఓటిటి సంస్థ భారీ మొత్తం ఆఫర్ చేస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయట. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమాతో ఈ మెగా యంగ్ హీరోకి మెగా హిట్ వస్తోందేమో చూడాలి. హిట్ వచ్చినా రాకపోయినా ఆల్ రెడీ వైష్ణవ్ తేజ్, క్రిష్ దర్శకత్వంలో మరో వినూత్నమైన సినిమా చేస్తున్నాడు.