“సర్కారు వారి పాట” పాన్ ఇండియన్ ఫ్లిక్ గా కన్ఫర్మేనా.?

“సర్కారు వారి పాట” పాన్ ఇండియన్ ఫ్లిక్ గా కన్ఫర్మేనా.?

Published on Sep 10, 2020 3:50 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మేకోవర్ తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యిపోయారు. తన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం సిద్ధం చేస్తున్న లాంగ్ హెయిర్ లుక్ లోనే కనిపించి ఆశ్చర్యపరిచారు. అయితే ఈ చిత్రం షూట్ కు ఇంకా సమయం ఉండగానే మహేష్ లుక్ ఎలా ఉండనుందో బయటకు వచ్చేసింది. ఇక అలాగే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల వార్తలు కూడా ఈ మధ్యన ఊపందుకున్నాయి.

బహుశా ఈ సినిమాను కూడా పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసే సన్నాహాల్లో దర్శకుడు పరశురామ్ ఉన్నారని అందుకే బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అనీల్ కపూర్ ను ఈ చిత్రంలో విలన్ రోల్ కు మాట్లాడుతున్నారని టాక్ వినిపించింది. ఇపుడు ఈ ఊహాగానాలు మరింత వినిపిస్తున్నాయి. దీనితో ఇవే గాసిప్స్ కనుక నిజం అయినట్లయితే ఈ సినిమాతోనే మహేష్ పాన్ ఇండియన్ ఎంట్రీ ఖాయమే అని చెప్పాలి. మరి ఈ స్పెక్యులేషన్స్ అన్ని ఎప్పుడు క్లియర్ అవుతాయో చూడాలి.

తాజా వార్తలు