పూరి, సేతుపతి ప్రాజెక్ట్.. తమిళ్ సినిమానా?

పూరి, సేతుపతి ప్రాజెక్ట్.. తమిళ్ సినిమానా?

Published on Sep 27, 2025 9:05 PM IST

ప్రస్తుతం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే మాస్ అండ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కోసం చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ తెలుగులో తెరకెక్కిస్తున్నారు.

విజయ్ సేతుపతి హీరోగా మొదటి తెలుగు సినిమా చేస్తున్నారని అనుకున్నారు కానీ ఇప్పుడు టైటిల్ టీజర్ లాంచ్ ని మేకర్స్ తమిళ నాటే మొదట ప్లాన్ చేయడం జరిగింది. అలాగే పోస్టర్స్ లో చూసుకున్నా కూడా ముందు తమిళ్, ఆ తర్వాతే తెలుగు కనిపిస్తుంది. దీనితో మేకర్స్ తమిళ్ లోనే తెరకెక్కిస్తున్నారని అనుకోవాలి. ఇక ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు