నాగ చైతన్య తొలి ద్విపాత్రాభినయం?

నాగ చైతన్య తొలి ద్విపాత్రాభినయం?

Published on Dec 16, 2012 2:10 PM IST

naga-chaitanya

అక్కినేని మూడవ త్రయం నట వారసుడిగా పరిచయమయిన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. కానీ ఈ విషయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి వార్త వెలువడలేదు. ప్రస్తుతం నాగ చైతన్య ‘ఆటో నగర్ సూర్య’, తమిళ రీమేక్ ‘వెట్టై’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు కాకుండా కింగ్ నాగార్జునతో ‘ఢమరుకం’ లాంటి సోషియో ఫాంటసీ మూవీ తీసిన శ్రీనివాస్ రెడ్డితో ఓ సినిమా చేయనున్నాడు ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2013 జనవరిలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. నాగార్జున ఆస్థాన నిర్మాతగా చెప్పుకునే డి. శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఇప్పటికే అక్కినేని నాగేశ్వరరావు ‘ఇద్దరు మిత్రులు’, నాగ్ ‘హలో బ్రదర్’ సినిమాలలో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, నాగచైతన్య కూడా ద్విపాత్రాభినయంలో ప్రేక్షకులను మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు