నన్ను దోచుకుందువటే చిత్రంలో టాలీవీడ్ ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్, పూరీ – రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో చాందినిగా మెరిసిన ఈ ముద్దుగుమ్మ, మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ చిత్రంలో తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టిన నభా.. తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇటీవల రవితేజతో డిస్కోరాజా చిత్రంలో నటించిన నభా నటేష్.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ – సంతోశ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్ చిత్రంలో నటిస్తోంది.
అయితే నభా నటేష్‌కు సంబందించిన ఒక వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఒకే ఒక్క హిట్‌తో నభా నటేష్ తన పారితోషికాన్ని స్టార్ హీరోయిన్ రేంజ్‌లో పెంచిందట. దీంతో తమ సినిమాల్లో ఈ క్రేజీ భామను తీసుకోవడానికి దర్శక, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారని, పెంచిన రెమ్యునరేషన్ మరీ హై రేంజ్‌లో ఉండడంలో, అంత సాహసం చేయడానికి ఇష్టపడని నిర్మాతలు, నభాకి బదులుగా మరో హీరోయిన్‌ను సంప్రదిస్తున్నారట. మరీ లాక్ డౌన్ తరువాత నుండైనా నభా, నిర్మాతలకు అందనంత ఎత్తులో కాకుండా.. అందుబాటులో ఉంటుందేమో చూడాలి.