మిల్కీ బ్యూటీకు కరోనా పాజిటివ్.?

మిల్కీ బ్యూటీకు కరోనా పాజిటివ్.?

Published on Oct 4, 2020 2:05 PM IST

మన టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో అన్ని రకాల అత్యుత్తమ టాలెంట్ కలిగిన తమన్నా భాటియా కూడా ఒకరు. అయితే అందరి హీరోయిన్స్ లానే తమన్నా కూడా లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయ్యింది. ఇదిలా ఉండగా ఇపుడు షూటింగ్స్ అన్నీ మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుండడంతో చాలా మందే సినీ తారలు పాల్గొనేందుకు ముందుకు వస్తుండగా తమన్నా కూడా తన సినిమా షూట్ కోసం హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తుంది.

కానీ ఆమెకు హై ఫీవర్ రావడంతో కరోనా టెస్ట్ చెయ్యగా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనితో ఆమెను వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసారని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇంకా అధికారిక సమాచారం రాలేదు. గత కొన్నాళ్ల కితం తమన్నా ఇంట్లో ఉన్నప్పుడే ఆమె తల్లిందండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు