ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు ఇద్దరు తమ భారీ పాన్ ఇండియన్ చిత్రాలతో రెడీ అవుతున్నారు. ఇక అలాగే వీటితో పాటు కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఒకే స్టార్ దర్శకునితో సినిమాలు చెయ్యాల్సి ఉంది. అయితే వీటిలో చరణ్ చేసేది కేవలం గెస్ట్ రోల్ కాగా బన్నీతో ఒక ఫుల్ సినిమాను ప్లాన్ చేసారు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ.
అయితే ఈ స్టార్ట్ దర్శకుడితో పని చేయనున్న ఇద్దరికీ అనూహ్యంగా ఒకలాంటి రోల్ నే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న “ఆచార్య”లో చరణ్ గెస్ట్ రోల్ కనిపించనున్నాడు. అయితే ఆ రోల్ లో చరణ్ ఒక స్టూడెంట్ లీడర్ లా కనిపిస్తాడని టాక్ తెలిసిందే.
మరి ఇక బన్నీ సినిమా విషయానికి వస్తే ఇందులో కూడా బన్నీ ఒక స్టూడెంట్ లీడర్ లానే కనిపిస్తాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదే కనుక నిజం అయితే బన్నీ మరియు చరణ్ ల రోల్స్ దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. మరి కొరటాల డిజైన్ చేసిన ఈ రోల్స్ యాదృచ్చికమా కాదా అన్నది కాలమే నిర్ణయించాలి.