నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రమే ‘అఖండ 2 తాండవం’. రీసెంట్ గానే వచ్చిన టీజర్ తో మరింత హైప్ ని అందుకున్న ఈ సినిమా టీజర్ తర్వాత మరో లెవెల్ కి వెళుతుంది. ఇలా భారీ ఓటిటి ఆఫర్స్ ని అందుకోవడమే కాకుండా ఇప్పుడు యూఎస్ మార్కెట్ లో కూడా బాలయ్య కెరీర్లోనే రికార్డు డీల్ తో బరిలోకి దిగబోతుంది అని తెలుస్తుంది.
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అఖండ 2 యూఎస్ మార్కెట్ లో సుమారు రెండున్న మిలియన్స్ కి పైగా టార్గెట్ తో విడుదల కానుందట. అంటే మొత్తం 5 మిలియన్ కి పైగా వసూళ్లు చేస్తే కానీ లాభాల్లోకి ఈ సినిమా వెళ్ళదు. ప్రస్తుతం అయితే మూమెంటం గట్టిగానే ఉంది. మరి చూడాలి అఖండ ఓవర్సీస్ మార్కెట్ లో ఆడించే తాండవం ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25 డేట్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.