సరికొత్త లుక్ తో చిరు చెప్పకనే చెప్పారా?

సరికొత్త లుక్ తో చిరు చెప్పకనే చెప్పారా?

Published on Sep 11, 2020 7:54 AM IST

మన టాలీవుడ్ స్టార్ హీరోల మేకోవర్ కోసం ఎప్పుడూ హాట్ టాపిక్ నడుస్తూనే ఉంటుంది. తాము అభిమానించే హీరో ప్రతీ సినిమా సినిమాకు ఒక సరికొత్త లుక్ లో కనిపించాలని కోరుకుంటుంటారు అందుకు తగ్గట్టుగానే తమ ప్రతీ సినిమాకు కూడా మన స్టార్ హీరోలు ఎంతవరకు అయినా వెళ్తారు.

అయితే ఇప్పుడు మన ఆల్ టైం నెంబర్ 1 స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా సరికొత్త మేకోవర్ కు శ్రీకారం చుట్టారని సినీ వర్గాల్లో రచ్చ లేస్తుంది. లేటెస్ట్ గా గుండు లుక్ లో దర్శనం ఇచ్చిన బాస్ ను చూసి ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. అయితే ఇంత సడన్ గా చిరు ఎందుకు ఇలా చేశారు అన్నదానికి మాత్రం ఇంకా సరైన సమాధానం దొరకట్లేదు.

ఇంకా కొరటాలతో తీస్తున్న “ఆచార్య” చాలా బాలన్స్ ఉంది మరి ఈలోపున చిరు ఇలా ఎందుకు ఇలా కనిపించారు అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ చిత్రం తర్వాత చిరు లూసిఫర్ మరియు వేదాళం రీమేక్స్ లో నటించాల్సి ఉంది. వాటిలో అయితే ఈ లుక్ వేదాళం కే దగ్గరగా ఉంది. సో ఆ సినిమాకు కావచ్చని టాక్ వినిపిస్తుంది కానీ కన్ఫర్మేషన్ అయితే లేదు. మొత్తానికి మాత్రం ప్రస్తుతానికి ఈ లుక్ వేదాళం కోసమే అన్ని చర్చ అయితే నడుస్తుంది.

తాజా వార్తలు