‘కింగ్డమ్’ బిగ్ అప్డేట్ వచ్చేస్తుందా!?

‘కింగ్డమ్’ బిగ్ అప్డేట్ వచ్చేస్తుందా!?

Published on Jul 5, 2025 8:00 AM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రమే “కింగ్డమ్”. విజయ్ కెరీర్లోనే ఎంతో హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది పెద్ద సస్పెన్స్ గా ఇపుడు నిలిచింది. అయితే ఫైనల్ గా మేకర్స్ రిలీజ్ కి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

ఇప్పుడు వరకు పలు తేదీలు అనౌన్స్ చేసి వాయిదా వేసిన మేకర్స్ ఇప్పుడు ఫైనల్ గా ఓ కొత్త డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారట. వస్తే నేడే లేదా ఈ రెండు రోజుల్లోనే ఆ బిగ్ అప్డేట్ ని రివీల్ చేసే అవకాశం ఉందట. సో కింగ్డమ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది బిగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సత్య తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు