‘అఖండ 2’ కి గుమ్మడికాయ కొట్టేశారా?

Akhanda2
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. వీరి నుంచి వస్తున్నా నాలుగో సినిమా పైగా ఒక సీక్వెల్ కూడా కావడంతో ఈ సినిమాపై గట్టి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంకి కూడా అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ 25నే థియేటర్స్ లో పడేది. కానీ ఆలస్యం కావడంతో వాయిదా వేశారు.

అయితే రీసెంట్ గానే ఓ సాంగ్ షూటింగ్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నట్టుగా ఇపుడు టాక్ వినిపిస్తుంది. ఇలా మొత్తానికి మేకర్స్ ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసినట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Exit mobile version