మన టాలీవుడ్ లో లేటెస్ట్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనదైన యాటిట్యూడ్ తో మంచి క్రేజ్ సంతరించుకొని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లు కూడా చేస్తూ రెడీ అవుతున్నాడు. ఇక అలాగే మన దక్షిణాది స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క కు కూడా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. అయితే విజయ్ జివాల్మ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తాడన్న సంగతి తెలిసిందే.
అలా ఇప్పుడు విజయ్ టీం మరియు అనుష్క శెట్టిల టీమ్ ఒక సినిమాను తెరకెక్కించే విషయంలో టై అప్ అయ్యే సూచనలు ఉన్నట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఈ ఇద్దరు ఒక నూతన దర్శకునితో సినిమా చేయనున్నారని టాక్. ఇప్పటికే ఆ దర్శకుని స్క్రిప్ట్ విని వీరు ఇంప్రెస్ అయ్యారని తెలుస్తుంది. ఇక అన్నీ సెట్టయితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టనున్నరు. ఇటీవలే అనుష్ణ నటించిన తాజా చిత్రం “నిశ్శబ్దం” అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే.