పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. దీని నుంచి వచ్చిన అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఎట్టకేలకి రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకుంది. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఇప్పుడు సాంగ్ తో వైబ్ అవుతుండగా ఫ్యాన్స్ కి మరో క్రేజీ ట్రీట్ కి రంగం సిద్ధం అవుతున్నట్టుగా ఇపుడు కొత్త న్యూస్ వినిపిస్తుంది.
దీని ప్రకారం రానున్న ఆగస్టు 15కి మరో సాలిడ్ సర్ప్రైజ్ చిత్ర యూనిట్ నుంచి వచ్చే అవకాశం ఉందట. ఇది కూడా మరిన్ని అంచనాలు పెంచేలా ఉంటుంది అని వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 25న గ్రాండ్ గా సినిమా విడుదల కాబోతుంది.