చరణ్ నుంచి మరో భారీ అనౌన్స్మెంట్ రాబోతోందా.?

చరణ్ నుంచి మరో భారీ అనౌన్స్మెంట్ రాబోతోందా.?

Published on Feb 14, 2021 2:47 PM IST

లేటెస్ట్ గానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చింది తెలిసిందే. ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లాక్ చేసిన చరణ్ ఆ ఒక్క ప్రాజెక్ట్ తో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ ను నమోదు చేసాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చెయ్యక ముందు రామ్ చరణ్ ఏ దర్శకులతో తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేస్తాడో అని అంతా అనుకున్నారు.

మరి అప్పుడు శంకర్ తో పాటుగా మంచి టాలెంటెడ్ యంగ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరు కూడా వినిపించింది. మరి దీనికి సంబంధించే మరో స్ట్రాంగ్ బజ్ కూడా వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే ప్లాన్ చేయనున్నారని దీనిపై కూడా ఒక అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని గాసిప్స్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ భారీ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం చరణ్ RRR మరియు ఆచార్య అనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు