ఎన్.టి.ఆర్ సినిమాలో ఇంటర్నేషనల్ సింగర్ పాడనున్నడా?

ఎన్.టి.ఆర్ సినిమాలో ఇంటర్నేషనల్ సింగర్ పాడనున్నడా?

Published on Jul 19, 2012 12:12 PM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా తెరకెక్కుతున్న “బాద్షా” సినిమాలో ఇంటర్నేషనల్ ప్రఖ్యాత పాప్ సింగర్ ఎకాన్ ఒక పాట పాడనున్నారు. ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు మరియు దీనికి సంభందించిన చర్చలు కూడా తొలి దశలోనే ఉన్నాయి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ ఆ పాటకి సరైన ట్యూన్ ని ఇప్పటికే సిద్దం చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన రెండవసారి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు