సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. 2014 జనవరి 10న రిలీజ్ కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఈ సినిమాని అత్యంత అధునాతన సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు.
మేము విన్న దాని ప్రకారం ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబందించిన విఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండనున్నాయని సమాచారం. హాలీవుడ్ లో భారీ బడ్జెట్, బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ‘1’ కోసం పనిచేస్తున్నారు. ‘1’ లో చాలా వేగంగా సాగే చేజింగ్ సీక్వెన్స్ లు ఉంటాయి, వాటి విషయంలో విఎఫ్ఎక్స్ చేయాలంటే అనుభవజ్ఞులైన వారు కావాలని ఇంటర్నేషనల్ టీంతో పనిచేయిస్తున్నారు.
సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మహేష్ బాబు సరసన్ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.