మనం తరువాత హీరో నాగ చైతన్య దర్శకుడు విక్రమ్ కుమార్‌తో మరోసారి కలిసి పని చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై అనేక రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో అంతర్లీనమైన మరియు అద్భుతమైన సందేశం ఉండబోతుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చైతుతో తన చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదని, ఇది రొమాన్స్ మరియు కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్టైనర్ అని ఆయన అన్నారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇప్పటికే షూట్ కు అవసరమైన సన్నాహాలు కూడా మేకర్స్ చేసుకున్నారు.
కాగా విక్రమ్ కుమార్ అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని తీశారు. అలాగే అఖిల్ హీరోగా ‘హలో’ అనే చిత్రాన్ని కూడా రూపొందించారు. ఈసారి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగచైతన్యతో సినిమాని తెరకెక్కించబోతున్నాడు. మరి చైతుని విక్రమ్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.