చై, కొరటాల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!

అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాక తన ఫామ్ ని అలానే కొనసాగించాలని సాలిడ్ కంటెంట్ పై దృష్టి పెట్టాడు. అలా తాను ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు తో ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివతో కూడా సినిమా చేయనున్నట్టుగా టాక్ వచ్చింది. అయితే దీనిపై మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి.

ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహించబోవడం లేదట. తాను నిర్మాణం వరకే ఉంటారని తెలుస్తుంది. అంతే కాకుండా దర్శకునిగా మరో కొత్త పేరు వస్తుంది అని వినిపిస్తుంది. మరి కథ కొరటాల అందించిందా అనేది తెలియాల్సి ఉంది. అలాగే మరిన్ని డీటెయిల్స్ మున్ముందు రానున్నాయి. నాగ చైతన్య తన కెరీర్ 25వ చిత్రాన్ని స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా టాక్.

Exit mobile version