ఆ లెజెండరీ యాక్టర్స్ మధ్య నిజంగానే ప్రేమ ఉందా..?

ఆ లెజెండరీ యాక్టర్స్ మధ్య నిజంగానే ప్రేమ ఉందా..?

Published on Mar 23, 2020 5:05 PM IST

కరోనా కారణంగా రాబోయి అన్ని సినిమాల షూటింగ్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని పోస్ట్ ఫోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాట అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ ‘జయలలిత’ జీవితం ఆధారంగా ‘ఏ ఎల్ విజయ్’ దర్శకత్వంలో రానున్న ‘తలైవి’ బయోపిక్ కూడా ప్రస్తుతం ఆగిపోయింది. అయితే ఈ సినిమాలో శోభన్ బాబు పాత్ర గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. తెలుగు ప్రేక్షకులకు శోభన్ బాబు అంటే ప్రత్యేకమెన అభిమానం. ఆయన పాత్ర ఈ బయోపిక్ లో ఉందనే మొదటినుండి ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకి విషయంలోకి వెళ్తే.. శోభన్ బాబు – జయలలిత మధ్య అనుబంధం పై వచ్చిన రూమర్స్ లో వాస్తవం ఎంత.. వారి మధ్య నిజంగానే ప్రేమ ఉందా.. ఏ కారణాల చేత వాళ్ళు పూర్తిగా దూరం అవ్వాల్సి వచ్చింది..అనే అంశాలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు.

ఇక జయలలిత పాత్రలో బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ బయోపిక్ కోసం ప్రత్యేకంగా తమిళం కూడా నేర్చుకుంటుందట ఈ బాలీవుడ్ క్వీన్.
అన్నట్టు ఈ సినిమాలో రాజకీయంగా జయలలిత పై జరిగిన కుట్రలు, అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడుల్లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉంది లాంటి అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా సినిమాలో హైలెట్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుందట. మొత్తానికి అమ్మ బయోపిక్ లో ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు