మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. మెగా సినిమా కావడంతో ఈ సినిమా పై రూమర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. చిరు ఆచార్య టైటిల్‌ని హడావిడి లేకుండా ప్రకటించడమే కాకుండా.. రామ్ చరణ్ పాత్రను కన్ఫర్మ్ చేశాడు. ఇక చెర్రి పాత్రకు హీరోయిన్ కూడా ఉంటుందని కొరటాల క్లూ ఇచ్చారు.
ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో రామ్ చరణ్ పాత్ర పై రక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆచార్యలో చరణ్ పాత్ర ఉద్వేగ పూరితంగా ఉంటుందని, ఈ సినిమాకి చరణ్ పాత్ర హైలెట్‌గా నిలుస్తుందని.. దాదాపుగా చరణ్ పాత్ర అర గంట సేపు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
ఆచార్య కథ ప్రకారం రామ్ చరణ్ గూండాల చేత చంపబడతాడని, రామ్ చరణ్‌ను చంపే గూండాల పై కోపంతో.. కసితో చిరంజీవి వారి పై ప్రతీకారం తీర్చుకుంటాడని, కథలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయట.