బోయపాటి సినిమాలో బాలయ్య రోల్స్ అవే !

బోయపాటి సినిమాలో బాలయ్య రోల్స్ అవే !

Published on Apr 21, 2020 3:00 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే అనేక రకాలుగా అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మరొక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో బాలయ్య క‌వ‌ల‌లుగా క‌న‌ప‌డ‌బోతున్నారని.. వాళ్ళు పెద్దయ్యాక ఒకరు అఘోరాగా మారితే, మరొకరు రాజకీయ నాయకుడిగా మారతాడని.. రాజకీయ నాయకుడి పాత్ర కోసమే బాలయ్య గుండు చేయించుకున్నాడని తెలుస్తోంది.

ఇక కరోనా ప్రభావం తగ్గాక రామోజీ ఫిల్మ్ సిటీలో తరువాత షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు