కోలీవుడ్ టాలెంటెడ్ అండ్ మ్యాచో హీరో ఆర్య హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన క్రేజీ పీరియాడిక్ బాక్సింగ్ డ్రామా చిత్రం “సార్పట్ట పరంపర” కూడా ఒకటి. కొన్నేళ్ల కితం లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటిటిలోనే విడుదల అయ్యిన ఈ చిత్రం భారీ రెస్పాన్స్ ని అందుకుంది. థియేటర్స్ లో రిలీజ్ అయితే సూపర్ హిట్ అవుతుంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ ఉందని అందరికీ తెలిసిందే.
అటు తమిళ్ ఆడియెన్స్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్ లో ఇదీ ఒకటని చెప్పవచ్చు. మరి దీనిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఈ ఆగస్ట్ నుంచే సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అవైటెడ్ సీక్వెల్ కి సమయం దగ్గరకి వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ ముందు రానున్నాయి.