‘సలార్’, ‘కూలీ’.. ఇవి ఇంట్రెస్టింగ్ గా కలిసాయిగా!

పాన్ ఇండియా లెవెల్లో మంచి స్టార్డం ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ల కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరైన సినిమా పడితే చాలు అవి సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మరి వీరి ఇద్దరి నడుమ కొన్ని అంశాలు కొంచెం ఆసక్తికరంగానే ఉంటాయి.

గతంలో సూపర్ స్టార్ వీరాభిమానిగా నటించిన ప్రభాస్ ఇపుడు రజినీ స్థాయి స్టార్డంని సొంతం చేసుకున్నాడు. ఇక రజినీకాంత్ కూలీ విషయానికి వస్తే ప్రభాస్ మాస్ యాక్షన్ చిత్రం సలార్ తో లింక్ అయ్యింది. సలార్ సినిమాలో ప్రభాస్ పేరు దేవా అలాగే ఇప్పుడు కూలీ సినిమాలో రజినీకాంత్ పేరు దేవా..

ఇదే కాకుండా అప్పుడు సలార్ వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన డంకీ తో క్లాష్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు కూలీ కూడా అంతకు మించిన భారీ బాలీవుడ్ సినిమా వార్ 2 తో క్లాష్ అవుతుంది. ఇలా ఈ రెండు సినిమాలకి ఈ అంశాలు ఇంట్రెస్టింగ్ గా కలిశాయని చెప్పాలి. ఫ్యాన్స్ లో కూడా ఈ ఇంట్రెస్టింగ్ అంశం వైరల్ గా మారింది.

Exit mobile version