‘వీరమల్లు’ ప్రీ రిలీజ్ గెస్ట్స్ లిస్ట్ లో ఇంట్రెస్టింగ్ పేర్లు!?

‘వీరమల్లు’ ప్రీ రిలీజ్ గెస్ట్స్ లిస్ట్ లో ఇంట్రెస్టింగ్ పేర్లు!?

Published on Jul 13, 2025 7:00 PM IST

తెలుగు సినిమా దగ్గర ఓ భారీ సినిమా అందులో బిగ్ స్టార్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. మరి ఇలాంటి సమయంలో వస్తున్న అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ రిలీజ్ కి సమయం ఇప్పుడు దగ్గరకి వస్తుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి మరిన్ని ఆసక్తికర వార్తలు బయటకి వస్తున్నాయి.

దీనితో ‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక మారడం నుంచి ఇప్పుడు ముఖ్య అతిధులుగా ఎవరు వస్తారు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ లిస్ట్ లో టాప్ దర్శకులు అందులోని మన చరిత్రపై బాగా అవగాహన ఉన్న దర్శకులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిలు హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా వినిపిస్తోంది.

ఎలాగో జక్కన్న కుటుంబ సభ్యుడు ఎం ఎం కీరవాణినే ఈ సినిమాకి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. సో జక్కన్న ప్రెజెన్స్ కి కూడా ఛాన్స్ ఉంది కానీ దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. దర్శకులు క్రిష్ – జ్యోతికృష్ణలు తెరకెక్కించిన ఈ భారీ సినిమా ఈ జూలై 28న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు