లేటెస్ట్ గా ఇండియన్ సినిమా నుంచి వచ్చిన ఒక ఎపిక్ అనౌన్సమెంట్ ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ నుంచి రానున్న చిత్రం ‘రామాయణ’ కోసమే అని చెప్పాలి. అయితే ఈ భారీ సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో ఇంట్రెస్టింగ్ తారాగణం కనిపించనుంది.
బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ రామునిగా, కన్నడ సినిమా నుంచి యష్ రావణునిగా సాయి పల్లవి సీతగా కనిపించబోతున్నారు. అయితే ఇదే సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఉన్నట్టుగా బయటకి వచ్చింది. అయితే ఇపుడు ఈ ఇద్దరి హీరోయిన్స్ విషయంలో ఆసక్తికర చర్చ మొదలైంది.
కాజల్ రావణునికి భార్య పాత్రలో కనిపిస్తుంది అని టాక్ ఇపుడు వినిపిస్తుండగా కాజల్ ని వదిలేసి సాయి పల్లవిని సీతగా ఎందుకు పెట్టుంటారు అనే డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది. కాజల్ పేరు రాకముందు ఇలాంటి డిస్కషన్ సాయి పల్లవిపై రాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఆసక్తిగా మొదలైంది. మరి సినిమాలో ఇద్దరి ప్రెజెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.