ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 4, 2025
స్ట్రీమింగ్ వేదిక : జియో హాట్‌స్టార్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : ప్రియమణి, సంపత్ రాజ్, ఆరి అర్జునన్, హలిత షమీమ్ తదితరులు
దర్శకత్వం : రేవతి
నిర్మాతలు : రాజేష్ చడ్డా, మృణాలిని జైన్, శ్యామ్ రాఠి, దీపక్ ధర్, రిషి నేగి
సంగీతం : కె
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ రామస్వామి
ఎడిటింగ్ : కిషన్ కుమార్ చెళియన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో కోర్ట్ రూం డ్రామాగా తెరకెక్కిన తమిళ వెబ్ సిరీస్ ‘గుడ్ వైఫ్ సీజన్ 1’ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రియమణి లీడ్ రోల్‌లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
తరుణిక(ప్రియమణి) ఆమె భర్త గుణసీలన్(సంపత్ రాజ్)లది అన్యోన్య దాంపత్యం. కొన్ని కారణాల వల్ల వారి జీవితంలో అలజడి రేగుతుంది. ఓ కేసులో గుణసీలన్ జైలుకు వెళ్తాడు. దీంతో తన కుటంబానికి అండగా ఉండేందుకు లాయర్‌గా ప్రాక్టీ్స్ మొదలుపెడుతుంది. ఈ క్రమంలో చోటు చేసుకునే నాటకీయ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయి..? గుణసీలన్ జైలు నుంచి బయటకు వస్తాడా..? లాయర్‌గా తరుణిక ఎలాంటి కేసులు వాదిస్తుంది..? చివరకు ఏం జరుగుతుంది..? అనేది ఈ వెబ్ సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్ :
కోర్టు రూం డ్రామా అనగానే అందులో ఉండే కథపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొంటాయి. ఈ వెబ్ సిరీస్‌లోనూ కోర్ట్ రూంలో జరిగే డ్రామా ప్రేక్షకులను కొంతవరకు మెప్పిస్తుంది. ఇక తరుణిక పాత్రలో ప్రియమణి మంచి నటన కనబర్చింది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. భార్యగా, పిల్లలకు తల్లిగా, లాయర్‌గా ఆమె తన పాత్రను హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.
పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు.. వారి పట్ల జాగ్రత్తగా లేకపోతే ఏం జరుగుతుందనే పాయింట్‌ను చక్కగా చూపెట్టారు. కోర్టులో న్యాయ పరంగా ఎలాంటి ప్రొసీడింగ్స్ జరుగుతాయనేది కూడా బాగా చూపెట్టారు. క్లైమాక్స్‌లో ఓ చక్కటి ట్విస్టుతో సీజన్ 2 కి లీడ్ ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి కోర్టు రూం డ్రామాలో సస్పెన్స్, ట్విస్టులు, నిజాలు రివీల్ చేసే అంశాలు ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ, అలాంటివి ఏవీ మనకు ఈ వెబ్ సిరీస్‌లో కనిపించవు. చాలా ఫ్లాట్‌గా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. కోర్టులో జరిగే సీన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవు. చాలా రొటీన్‌గా కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం.. ఆ తర్వాత భార్య తమ పిల్లల కోసం లాయర్‌గా మారడం.. వంటి సీన్స్‌ను సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. లాయర్‌గా మారిన ప్రియమణి భర్త గురించి పట్టించుకోకపోవడం కూడా మెప్పించదు. ఇక పిల్లలతో ఆమె మెదిలే సీన్స్ కొంతవరకు మాత్రమే కనెక్ట్ అవుతాయి. తన ఎక్స్ లవర్‌తో ఉండే సీన్స్ కూడా ఆకట్టుకోవు.
సింపుల్ స్క్రీన్‌ప్లే తో సాగే ఈ వెబ్ సిరీస్‌కు స్లో నెరేషన్ మైనస్‌గా నిలిచింది. ఆకట్టుకునే అంశాలు ఒకట్రెండు మినహా వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఎక్కడా ఆసక్తి కనిపించదు. ల్యాగ్ సీన్స్ కూడా ఈ వెబ్ సిరీస్‌కు మైనస్.
సాంకేతిక విభాగం :
దర్శకురాలు రేవతి కోర్టు రూం డ్రామా నేపథ్య కథలో ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేసి ఈ వెబ్ సిరీస్‌ను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు. ఆమె ఈ వెబ్ సిరీస్‌ను హ్యాండిల్ చేసిన తీరులో చాలా లోటుపాట్లు కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో మేకర్స్ జాగ్రత్తగా ఉండాల్సింది. సంగీతం పరంగా బీజీఎం ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ ఇంకా బాగుండాల్సింది.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘గుడ్ వైఫ్ సీజన్ 1’ వెబ్ సిరీస్‌ను కోర్టు రూం డ్రామాగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఒకట్రెండు సీన్స్, ప్రియమణి నటన ఈ వెబ్ సిరీస్‌కు ప్లస్ అయ్యాయి. ఇందులో ఫ్యామిలీ డ్రామా డోస్ ఎక్కువగా ఉండటం, స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగడం, ఆకట్టుకునే అంశాలు లేకపోవడం మైనస్. కోర్టు రూం డ్రామా కంటెంట్ ఇష్టపడేవారికి ఈ వెబ్ సిరీస్ కనెక్ట్ కాకపోవచ్చు.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team