వెంకీ మామ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కి ఊహించని హీరోయిన్?

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకీ మామ ఆ సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఏంటి అనేది మరింత ఆసక్తి రేపింది. అయితే వెంకీ మామతో సాలిడ్ ఎంటర్టైనర్స్ తో మంచి ట్రాక్ రికార్డు ఉన్న స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈసారి చేయనున్నారు.

అయితే ఈ సినిమా అతి త్వరలోనే మొదలు కానుండగా ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లాక్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఆమె ఎవరో కాదు భారీ చిత్రాలు హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ నిధి అగర్వాల్ అట. మరి ఈమె వెంకీ మామ సరసన కనిపించనుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version