ఇంట్రెస్టింగ్.. హిందీలో పెరుగుతున్న ‘కూలీ’ ఆదరణ

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్ అలాగే ఉపేంద్ర లాంటి స్టార్స్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘కూలీ’. నెక్స్ట్ లెవెల్ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ అనిపించే ఓపెనింగ్స్ ని తమిళ సినిమాకి అందించింది. ఇక హిందీలో కూడా ఈ సినిమా సాలిడ్ పెర్ఫామెన్స్ ని చేస్తుండడం విశేషం.

ఇలా మొదటి రోజుకి రెండో రోజుకి బుకింగ్స్ పరంగా కూలీ అక్కడ వార్ 2 లాంటి స్ట్రైట్ బాలీవుడ్ సినిమా ఉన్నప్పటికీ పెరగడం విశేషం. డే 1 కి 91 వేలకి పైగా టికెట్స్ బుక్ అయితే రెండో రోజుకి లక్షకి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. దీనితో హిందీలో కూలీ ఆదరణ పెరిగింది అనే చెప్పాలి. ఇక హిందీలో ఈ సినిమాని కూలీ ది పవర్ హౌస్ పేరిట విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version