‘బిగ్ బాస్’: ఆసక్తి రేకెత్తిస్తున్న మొదటి AI కంటెస్టెంట్!

‘బిగ్ బాస్’: ఆసక్తి రేకెత్తిస్తున్న మొదటి AI కంటెస్టెంట్!

Published on Jul 3, 2025 7:00 PM IST

వరల్డ్ వైడ్ గా సహా ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ పై కూడా ఎంతో పాపులర్ అయ్యినటువంటి సెన్సేషనల్ హిట్ రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. అయితే బిగ్ బాస్ ఇప్పుడు వరకు పాన్ ఇండియా భాషల్లో అలరించి ఆకట్టుకుంది. అయితే ఇండియన్ టీవీ స్క్రీన్స్ దగ్గర అత్యధిక సీజన్స్ హిందీలో జరిగాయి.

మొత్తం 18 సీజన్స్ కంప్లీట్ అయ్యి ఇపుడు 19వ సీజన్ కి చేరుకుంది. ఇక ఈ కొత్త సీజన్ పట్ల మరింత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈసారి తారలతో పాటుగా ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే కొత్త కంటెస్టెంట్ ని కూడా యాడ్ చేయబోతున్నారట. ఇది ఒకింత ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ ఏఐ కంటెస్టెంట్ పేరు ‘హబుబు’.

అరబ్ దేశానికి చెందిన తరహా భాష, వేషధారణలో ఈ ఏఐ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తుందట. ఇది వంట చేయగలదు, క్లీన్ చేయగలదు.. ఇంకా 7 భాషల్లో కూడా మాట్లాడుతుందట. దీనితో హిందీ బిగ్ బాస్ విషయంలో ఈసారి మరింత ఆసక్తి రేగింది. అయితే ఈ సీజన్ మొదలు కావడానికి కొంచెం సమయం ఉంది కానీ ఈ గ్యాప్ లో ఈ కొత్త మూవ్ అనేది ఆడియెన్స్ మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇది మరి రియాలిటీలో ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు