యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “వారధి” ప్రస్తుతం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం చిత్రం లో పోరాట సన్నివేశాలు అద్బుతంగా ఉండబోతుందని చెప్పారు. గతం లో ఏ చిత్రం లో లేని విధంగా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాటు తెలుస్తుంది. ఇవి చాల సహజ సిద్దంగా ఉండబోతున్నట్టు కూడా చెప్తున్నారు. అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రం లో కథానాయికలుగా కనిపించబోతున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీ కృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.