రాజమౌళి ‘బాహుబలి’ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్

రాజమౌళి ‘బాహుబలి’ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్

Published on Jan 14, 2013 4:10 PM IST

Rajamouli

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు, ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ ‘బాహుబలి’ అని అనుకుంటున్నారు. ఈ సినిమాలో భారీగా హాయ్ వోల్టేజ్ తో ఉండే యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయి, అందుకోసం ప్రభాస్ కూడా తన బాడీ ని పెంచే ప్రయత్నంలో ఉన్నారు.

ఇటీవలే జరిగిన ‘మిర్చి’ ఆడియో ఫంక్షన్ లో ప్రభాస్ ఫుల్ గడ్డంతో, మంచి ఫిజిక్ తో కనిపించారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2014 లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. .

తాజా వార్తలు