మంచు విష్ణు ‘దేనికైనా రెడీ’ సినిమా విజయంతో 2012నుండి సక్సెస్ స్టార్ గా మారిపోయాడు. దానితరువాత వచ్చిన దూసుకెళ్తా, పాండవులు పాండవులు.. సినిమాలు కూడా విజయం సాధించాయి
ఇప్పుడు విష్ణు రామ్ గోపాల్ వర్మ తీసిన రౌడి లో ఒక కొత్త తరహా పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర ఇప్పటివరకూ తనకున్న ఇమేజ్ ను మార్చేస్తుందని అనుకుంటున్నారు
యాక్షన్, కామెడి నేపధ్యంలో విష్ణు నమ్మకమైన హీరో అని నిర్మాతల విశ్వాసం. కనీ ఈ రౌడి లో విష్ణు సీరియస్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటినుండి అందరి కళ్ళు ఈ సినిమా పై పడ్డాయి. ఒక్క హిట్ తో రాము ఇండస్ట్రీలో తిరిగి జెండా పాతగలడు
ఈ సినిమాలో మోహన్ బాబు, జయసుధ, సన్వి ముఖ్యపాత్రధారులు