“నయనతార అంటే నాకు చాలా ఇష్టం”- తాప్సీ

“నయనతార అంటే నాకు చాలా ఇష్టం”- తాప్సీ

Published on Jul 12, 2013 12:50 PM IST

Taapsee
నయనతారకు తాప్సీ పొన్ను రూపంలో ఒక కొత్త ఫ్యాన్ దొరికింది. వీరిద్దరూ ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో అజిత్, ఆర్యలు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో హీరోయిన్స్. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “నాకు నయనతార అంటే చాలా ఇష్టం. ఆమెతో కలిసి పనిచెయ్యడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఎప్పుడు ఆమెను ప్రజలు విమర్శించినా ఆమె తన నటనతో ధీటైన సమాధానం ఇస్తుంది. అది అంత తేలికైన విషయంకాదని”తెలిపింది. ఆమె వ్యక్తిగత విషయాలను, సంకల్పాన్ని సైతం మెచ్చుకుంది. ప్రస్తుతం తాప్సీ ముని 3 సినిమానే కాక మరో హిందీ సినిమాను అంగీకరించింది. ఈమె నటించిన ‘సాహసం’ ఇప్పటికే విడుదలై టెక్నికల్ విలువలు, ఆర్ట్ వర్క్ లకు మంచి స్పందనను సంపాదించుకుంది.

తాజా వార్తలు