నాగ చైతన్య సరసన హన్సిక నటించడం లేదు.!

నాగ చైతన్య సరసన హన్సిక నటించడం లేదు.!

Published on Jul 14, 2013 3:15 PM IST

Hansika
గత కొద్ది కాలంగా బొద్దు గుమ్మ హన్సిక ‘హలో బ్రదర్’ రీమేక్ లో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి కానీ ఆ సినిమా హన్సిక చెయ్యడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో తమన్నా, హన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీనివాస రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ సినిమాని డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. కానీ కొద్ది సేపటి క్రితమే ‘ హలో బ్రదర్ సినిమాలో నేను నటించడం లేదు, కానీ నన్ను అడిగారు. ఇక నుంచి అయినా ఈ పుకార్లను ఆపేయండని’ హన్సిక ట్వీట్ చేసింది. ఈ సినిమాని అనౌన్స్ చేసి చాలా రోజులు అయినప్పటికీ ఆ తర్వాత సినిమా అప్డేట్స్ ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు నాగ చైతన్య సరసన నటించే అవకాశం ఎవరు దక్కించుకుంటారో చూడాలి. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు