నేను అజిత్ కి పెద్ద అభిమానిని – తాప్సీ

నేను అజిత్ కి పెద్ద అభిమానిని – తాప్సీ

Published on Dec 4, 2013 4:20 PM IST

Taapsee
గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న తాప్సీ కొన్ని హిట్స్, కొన్ని ఫ్లాప్స్ అందుకున్నారు. తాజాగా తమిళంలో తాప్సీ అజిత్ తో నటించిన ఆరంభం సినిమాతో విజయాన్ని అందుకుంది. విష్ణు వర్ధన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళనాడులో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో ఈ నెల 6న రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో తాప్సీ జర్నలిస్ట్ అవ్వాలనే కోరిక కలిగిన పాత్రలో కనిపించనుంది. ఆ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ టైంలో తాప్సీ బాగా ఎంజాయ్ చేసింది. ‘ నేను అజిత్ కి పెద్ద అభిమానిని. నేను అజిత్ కి ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లోనే అభిమానిని. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు అలాగే సెట్ లో ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తాడు. ఆయనతో షూటింగ్ చేయడం మరచిపోలేని అనుభవం అని’ తాప్సీ అంది.

ఈ సినిమాలో నయనతార, ఆర్యలతో పాటు రానా కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజ సంగీతం అందించిన ఈ చిత్ర తెలుగు వెర్షన్ కి శ్రీను బాబు నిర్మాత.

తాజా వార్తలు