ఈరోజుల్లో భారీ చిత్రాలలో బాగా బిజీగా కనిపిస్తున్న క్యారక్టర్ ఆర్టిస్ట్‌లలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. ఆయనకున్న సహజనటనా శైలి తనకు మరిన్ని ఆఫర్లను తెచ్చిపెడుతున్నాయి
ఇవేకాకుండా బుల్లితెరపై పలు షోలలో, సీరియళ్ళలో నాగబాబు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నాగబాబు తన తనయుడు వరుణ్ తేజ్ ను తెలుగుతెరకు పరిచయం చేసే పనిని కుడా తన భుజాలమీద వేసుకున్నాడు. తన తనయుడి ఆరంగ్రేటం సజావుగా జరగాలని కోరుకుంటూ అతనికి నృత్యాలు, పోరాటాలపై శిక్షణ ఇప్పిస్తున్నాడు. సత్యానంద్ ఇన్స్టిట్యూట్ లో ఇప్పటికే నటన నేర్చుకున్న వరుణ్ మొదటి సినిమా వివరాలు నాగబాబు డిసెంబర్ లో తెలపనున్నాడు. తన కుమారుడు టాలీవుడ్ లో ఘనమైన ఎంట్రీని ఇస్తాడని, భారీ సినిమాలను చేయగలిగే స్టామినా వరుణ్ కి వుందని నాగబాబు చాలా నమ్మకంగా వున్నాడు