ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తానంటున్న మోహన్ బాబు

Mohan-Babu

కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు తను నటించిన ‘రౌడీ’ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు, శాన్వి, జయసుధ కూడా కీలక పాత్రలు పోషించారు.

డా. మోహన్ బాబు ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ వర్మని ప్రశంషించాడు. ‘నేను వర్మతో 10 ఏళ్ళ క్రితమే పని చేయాలి కానీ అప్పుడు ఎందుకో అది కుదరలేదు. ఇన్నాళ్ళకి ఇలా కుదిరింది. అలాగే వర్మకి తను చేసే పని మీద ఉన్న క్లారిటీ చూసి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. కేవలం 30 రోజుల్లో షూటింగ్ పూర్తిచేయడం షాకింగ్ గా అనిపించింది. నేను చాలా రోజుల నుంచి సినిమాలకి దూరంగా ఉంటూ నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో బిజీగా ఉన్నాను. ఇటీవల వచ్చిన నా సినిమాల రెస్పాన్స్ చూసిన తర్వాత భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నానని’ అన్నాడు.

అలాగే తను ఎప్పుడు కారణం లేకుండా కోప్పడనని అన్నాడు. ‘ ఎవరికైతే నా గురించి తెలియదో వాళ్ళు నాకు కోపం ఎక్కువని, షార్ట్ టెంపర్ అని అనుకుంటారు. ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఏమిటంటే కారణం లేకుండా నాకు కోపం రాదు. వర్మ కూడా అలాంటివాడే. అందుకే కొంతమంది మమ్మల్ని వివాదాస్పద వ్యక్తులు అంటారు, నా దృష్టిలో వివాదం అనేది ప్రతి మనిషిలో ఉండే నేచర్’ అని మోహన్ బాబు అన్నాడు.

Exit mobile version