గతంలో గోవా బ్యూటీ ఇలియానా టాప్ హీరోయిన్ గా బాగా బిజీగా ఉండేది, ప్రస్తుతం ఈ భామ తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టడంతో సౌత్ లో ఒక్క సినిమాకి కూడా సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం తను రెండు బిగ్ బాలీవుడ్ మూవీస్ లో నటిస్తోంది. గత శుక్రవారమే తను నటించిన ‘ఫటా పోస్టర్ నిక్లా హీరో’ సినిమా విడుదలైంది.
‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ సినిమాలో కాస్త సీరియస్ రోల్ చేసింది. దాంతో తనకి ఎక్కడ సీరియస్ పాత్రలు మాత్రమే చేయగలదు అనే ఇమేజ్ పడిపోతుందేమో అని భయపడుతున్న ఇలియానా తనని గ్లామర్ డాల్ గా పిలవమని చెబుతోంది.
‘నాకు సౌత్ సినిమాల్లో కూడా గ్లామర్ గర్ల్ గానే పేరుంది. అక్కడ అన్ని కమర్షియల్ సినిమాలే చేసాను. బాలీవుడ్ లో కూడా అదే ఇమేజ్ ని కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్లామర్ హీరోయిన్ అనే ట్యాగ్ లేకపోతే బాలీవుడ్ లో రాణించడం కష్టమైన పని. విద్యాబాలన్ లాంటి నటికైతే అలాంటి ట్యాగ్ లైన్ అవసరం లేదు. నేనేం విద్యాబాలన్ కాదు. కాబట్టి నేను గ్లామర్ బాటలోనే వెళ్ళాలనుకుంటున్నా అని’ తన మనసులో మాట చెప్పుకొచ్చింది ఈ గోవా బ్యూటీ. మనం కూడా ఇలియానాకి గ్లామర్ పాత్రలే వచ్చి తన గ్లామర్ ట్యాగ్ లైన్ బాలీవుడ్ లో కూడా కొనసాగాలని ఆశిద్దాం..