బాలీవుడ్ లో మళ్ళీ మెరిసిన ఇలియానా

బాలీవుడ్ లో మళ్ళీ మెరిసిన ఇలియానా

Published on Apr 9, 2014 1:00 PM IST

ileana (1)
సౌత్ ఇండియాలో బాగా క్రేజ్ ఉన్న టైంలో గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ కి వెళ్లి ‘బర్ఫీ’ చేసింది. ఆ సినిమా అక్కడ పెద్ద హిట్ అవ్వడమే కాకుండా మంచి పేరు కూడా తెచ్చి పెట్టింది. కానీ ఇలియానా ఆ తర్వాత షాహిద్ కపూర్ తో చేసిన సినిమా ఫ్లాప్ అయ్యింది. తాజాగా ఇలియానా చేసిన మెయిన్ తేరా హీరో సినిమా హిట్ అవ్వడంతో మళ్ళీ ఇలియానా బాలీవుడ్ లో మెరుస్తోంది.

డేవిడ్ ధావన్ దశాకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో రామ్ హీరోగా నటించిన ‘కందిరీగ’ సినిమాకి రీమేక్. తెలుగులో హన్సిక చేసిన పాత్రని హిందీలో ఇలియానా చేసింది. మెయిన్ తేరా హీరో సినిమాతో విజయం అందుకున్న ఇలియానా చాలా హ్యాపీగా ఉంది.

తాజా వార్తలు