బాలీవుడ్లో తొలి అవార్డు అందుకున్న ఇలియానా

బాలీవుడ్లో తొలి అవార్డు అందుకున్న ఇలియానా

Published on Jan 13, 2013 4:50 PM IST

ileana

సౌత్ లో బాగా పేరుతెచ్చుకున్న గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ కి పరిచయమైన మొదటి సినిమా ‘బర్ఫీ’ తోనే అక్కడ ఫుల్ మార్క్స్ కొట్టేసింది. నిన్న ముంబైలో జరిగిన 19వ స్టార్ స్క్రీన్ అవార్డ్స్ లో ఉత్తమ డెబ్యూట్ హీరోయిన్ గా ఎంపికై బాలీవుడ్లో తోలి అవార్డు అందుకుంది. 2012 ఇలియానాకి చెప్పుకోదగ్గ సంవత్సరం. తెలుగులో ‘జులాయి’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ బాలీవుడ్లో ‘బర్ఫీ’ తో హిట్ అందుకోవడమే కాకుండా వెంటనే షాహిద్ కపూర్ సరసన ఓ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది.

బాలీవుడ్లో తొలి అవార్డు అందుకున్నందుకు గోవా బ్యూటీ ఇలియానాకి 123తెలుగు.కామ్ శుభాకాంక్షలు తెలుపుతోంది.

తాజా వార్తలు