‘మైన్ తేరా హీరో’ సినిమాపై ఇలియానా ఆశలు

‘మైన్ తేరా హీరో’ సినిమాపై ఇలియానా ఆశలు

Published on Mar 14, 2014 1:20 AM IST

ileana
బాలీవుడ్ లో పాగా వేయగానే తెలుగు, చిత్రాలకు ఇలియానా టాటా చెప్పేసింది. తన మొదటి సినిమా బర్ఫీ తోనే అక్కడ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తరువాత విడుదలైన ఫటా పోస్టర్ నికలా ఆశించినంత విజయం సాధించలేదు

ఇప్పుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ‘మైన్ తేరా హీరో’ సినిమాలో నటిస్తుంది. ఈ కందిరీగ సినిమాకు రీమేక్. వరుణ్ ధావన్ హీరో. నగ్రిస్ ఫక్రి మరొ కధానాయిక. గతకొన్ని వారాలుగా ఈ సినిమా గురించిన ప్రచారంలో ఈభామ పాల్గుంటుంది. ఈ సినిమాలో నటించిన ఇద్దరితోనూ తనకు మంచి స్నేహం కుదిరిందని చెప్పుకొస్తుంది. ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వుంది. ఏప్రిల్ 4న విడుదలకానున్న ఈ సినిమా ఇలియానాకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి

ఈ చిత్రం కాకుండా ఇల్లూ ఆలీ ఖాన్ సరసన హ్యాపీ ఎండింగ్ లో నటిస్తుంది. ఈ ఏడాది మొదట్లో ఇలియానాకు టాలీవుడ్ ఆఫర్ వచ్చినా అది కుదరలేదు. ఇలియానా ఎప్పుడైనా టాలీవుడ్ లో అడుగుపెట్టే అవకాశాలు వున్నాయి

తాజా వార్తలు