మేఘాలలో తేలిపోతున్న సిద్దార్థ్

మేఘాలలో తేలిపోతున్న సిద్దార్థ్

Published on Feb 18, 2012 8:04 PM IST

“లవ్ ఫైల్యూర్” చిత్రానికి వస్తున్న సానుకూల విమర్శలకి సిద్దార్థ్ చాలా ఆనందంగా ఉన్నారు. సిద్దార్థ్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ చిత్రం అందరి విమర్శకుల మెప్పు పొందింది ఈ విషయమై సిద్దార్థ్ పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూ ” బొమ్మరిల్లు చిత్రం నుండి ఇప్పటి వరకు నా నటన గురించి ఇలా అందరి మెప్పు పొందటం ఇదే మొదటి సారి ఈ చిత్ర బృందానికి,బెల్లం కొండ సురేష్ మరియు తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు ఇలాంటి మరిన్ని చిత్రాలు భవిష్యత్తు లో చేస్తాను ” అని చెప్పారు. రేపటి నుండి ఈ చిత్రాన్ని మరిన్ని థియేటర్ ల లో ప్రదర్శించబోతున్నారు. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

తాజా వార్తలు