అల్లు అర్జున్ నటిస్తున్న “యిద్దరమ్మాయిలతో” చిత్రీకరణ దశలో ఉంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. గత కొన్ని రోజులుగా బార్సిలోనా, స్పెయిన్ లలో వివిధ లోకేషన్లలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా గురించి పూరీ మాట్లాడుతూ”ఇక్కడ షెడ్యూల్ పూర్తయింది. బార్సిలోనా, స్పెయిన్ వాసులకు బాగా దగ్గరయ్యాము. వాళ్ళని వీడి వెళ్తుంటే బాధ కలిగిందని” చెప్పాడు.
తదుపరి షెడ్యూల్ త్వరలో మొదలయ్యి 10రోజుల వరకూ కొనసాగి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. అమలా పాల్ మరియు కాథరిన్ త్రేస హీరోయిన్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్. మే 10న సినిమా విడుదల కానుంది.