ఇద్దరమ్మాయిలతో ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్

ఇద్దరమ్మాయిలతో ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్

Published on Apr 9, 2013 3:50 PM IST

Iddarammayilatho
ప్రతి సినిమాలోనూ ఏదో ఒక స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసాటి అల్ట్రా స్టైలిష్ లుక్ తో మనముందుకు వస్తున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. బన్ని బర్త్ డే సందర్భంగా నిన్న సాయంత్రం విడుదల చేసిన ‘ఇద్దరమ్మాయిలతో’ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లుక్ చాలా డాషింగ్ గా ఉంది, మోస్ట్ స్టైలిష్ గా ఉన్నాడు. స్టైలిష్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ విజువల్స్, టేకింగ్ చూసి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ రెట్టింపయ్యింది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బండ్ల గణేష్ ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్ లో ఉన్నాయి. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ మూడవ వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE FOR TRAILER

తాజా వార్తలు