స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ముందుగా ఈ సినిమాని మే 10 న రిలీజ్ చేయ్యాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ ని వాయిదా వేశారు. ఈ సినిమాని మే 24న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటించారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని బ్యాంకాక్, బార్సేలోనాలో షూట్ చేశారు. మిగిలి ఉన్న కొంత భాగం షూటింగ్ ని త్వరలోనే ముగించనున్నారు.
యంగ్ తరంగ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఈ నెల చివర్లో గానీ లేదా మే మొదట్లో గానీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పూరి ప్రతి సినిమాలోనూ ఖచ్చితంగా ఓ ఐటెం సాంగ్ ఉంటది కానీ ఈ సినేమాలోలేకపోడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఇంటర్నెట్లో మిలియన్ హిట్స్ సంపాదించుకోవడమే కాకుండా అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ సినీ అభిమానుల్లో అంచనాలను పెంచేసింది.
వాయిదాపడ్డ ఇద్దరమ్మాయిలతో రిలీజ్
First Posted at 14:30 on Apr 20st