పూర్తికావచ్చిన ఇద్దరమ్మాయిలతో రీ- రికార్డింగ్

పూర్తికావచ్చిన ఇద్దరమ్మాయిలతో రీ- రికార్డింగ్

Published on May 16, 2013 3:50 AM IST

Iddarammayilatho-Audio-Post
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్దంగావుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా యొక్క రీ- రికార్డింగ్ పనులుకుడా జరుతున్నాయి. మొదటి భాగం రికార్డింగ్ పూర్తయింది. మిగిలిన భాగం మరో ఒకటి రెండు రోజులలొ పూర్తవుతుంది .

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు పూరి జగన్ దర్శకుడు, బండ్ల గణేష్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు నిర్మాత. అల్లు అర్జున్ సరసన అమలా పాల్, కేథరినే త్రేస నటిస్తున్నారు. స్టైలిష్ లుక్ తో అల్లు అర్జున్ పాత్ర ప్రేక్షకులను అలరించనుంది. రావు రమేష్, బ్రహ్మానందం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

తాజా వార్తలు