ఒకరోజు ముందుగానే రానున్న ఇద్దరమ్మాయిలతో

ఒకరోజు ముందుగానే రానున్న ఇద్దరమ్మాయిలతో

Published on Apr 30, 2013 1:00 PM IST

Iddarammayilatho-Audio-Post

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో కనిపించనున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా మే 24న విడుదల కావాల్సి ఉంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినమాలో అల్లు అల్లు అర్జున్ సరసన అమలా పాల్, కేథరిన్ లు హీరోయిన్స్ గా నటించారు.

యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఆడియో లాంచ్ ఇటీవలే జరిగింది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సినిమాటోగ్రాఫర్ అమోల్ రాథోడ్ అందించిన విజువల్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆశిస్తున్నారు. పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం తను రెగ్యులర్ గా తీసుకునే టీంని కాకుండా కొత్త టీంని తీసుకున్నాడు. ఈ సినిమాతో తన కెరీర్లో మంచి బ్రేక్ వస్తుందని పూరి ఆశిస్తున్నాడు.

తాజా వార్తలు