స్టడీగా ఉన్న ఇద్దరమ్మాయిలతో కలెక్షన్స్

స్టడీగా ఉన్న ఇద్దరమ్మాయిలతో కలెక్షన్స్

Published on Jun 11, 2013 3:07 PM IST

Iddarammayilatho

స్టైలిష్ స్టార్ హీరోగా నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా సినీ ప్రేమికుల నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్స్ ఆఫీసు వద్ద కమర్శియల్ పెర్ఫార్మన్స్ డీసెంట్ గా ఉంది. దాదాపు అన్ని ఎరియాల్లోనూ సినిమా రెవిన్యూ స్టడీగా ఉంది. బి, సి సెంటర్స్ తో పోల్చుకుంటే ఎ సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ ఉంది. మరోవైపు బాక్స్ ఆఫీసు వద్ద బిగ్ బడ్జెట్ సినిమాలు ఏమీ లేకపోవడం కూడా సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది.

కేథరిన్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్టర్. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఈ సినిమా ఎక్కువ భాగాన్ని బ్యాంకాక్, స్పెయిన్ లో షూట్ చేసారు. ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్.ఆర్ శేఖర్ ఎడిటర్ గా పని చేసాడు. ఈ సినిమాలో అందరూ మెచ్చుకున్న యాక్షన్ సీక్వెన్స్ లను కేచ కంపోజ్ చేసాడు.

తాజా వార్తలు