స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరింత స్టైలిష్ లుక్ తో తెరకెక్కుతున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ ట్రైలర్ ని అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా అనగా ఈ రోజు విడుదల చేయనున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతో కసితో తీస్తున్న ఈ సినిమాని ఎక్కువ భాగం స్పెయిన్, బ్యాంకాక్లలో చిత్రీకరించారు. ఇప్పటికే 90% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుతున్నాయి.
ఈ సినిమా చాలా రిచ్ గా ఉండాలి, అలాగే బన్ని ఇంతకముందు కంటే స్టైలిష్ గా కనపడాలి అనే ఉద్దేశంతో ఖర్చుకి వెనుకాడకుండా బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ మూడవ వారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.